- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమం ఆగదు
దిశ,పెగడపల్లి : రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఆగేది లేదని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి,సీఎం సహాయ నిధి చెక్కులు, గల్ఫ్ బాధితులకు ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై 93 మంది లబ్ధి దారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు, 219 సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధి దారులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా రైతులకు రెండు లక్షల వరకు రుణ మాఫీ చేశామని, అర్హత ఉండి ఇంకా రుణ మాఫీ కానీ రైతులు ఉంటే వారి రుణ మాఫీ బాధ్యత తనదే అని హామీ ఇచ్చారు.
గత పాలకుల స్వార్థం వల్ల తలాపున గోదావరి ఉన్నా ఇక్కడి ప్రాంత రైతులకు సాగు నీటి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని, చివరి ఆయకట్టు రైతులకు సాగు నీరు అందించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి చూపుతామని, దానిలో భాగంగా సంక్రాంతి తర్వాత రైతు భరోసా కింద ఎకరాకు పన్నెండు వేలు రైతుల ఖాతాలో జమ చేయబోతున్నామని, అదే విధంగా భూమి లేని వారికి సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఈ నెల ఇరవై ఆరు నుండి గ్రామాల్లో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ రవీందర్, నందగిరి సింగిల్ విండో చైర్మన్ కర్ర భాస్కర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఒరుగలి శ్రీనివాస్, మహిళ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి శోభారాణి, నాయకులు కడారి తిరుపతి, పూసల తిరుపతి, తాటిపర్తి ప్రభాకర్ రెడ్డి, అమిరిశెట్టి మల్లా రెడ్డి, దికొండ మహేందర్, కొండ మధుసూధన్ రెడ్డి, పురుషోత్తమ అనిల్ గౌడ్, మద్దెల సుధీర్, తోట మల్లేశం, చాట్లా విజయ భాస్కర్, ప్రశాంత్, తడగొండ రాజు, తదితరులు పాల్గొన్నారు.