- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Aadi Srinivas : హైకోర్టు తీర్పు కేటీఆర్ కు చెంపపెట్టు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
దిశ, వెబ్ డెస్క్ : ఫార్ములా ఈ రేసు కేసు(Formula E Race Case)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR):క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేస్తు ఇచ్చిన తీర్పు ఆయనకు చెంప పెట్టువంటిదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas)విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ జైలు భయం పట్టుకుందన్నారు. అవినీతి, అక్రమాల నుంచి తప్పించుకోవడానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఫార్ములా రేసు కేసు ఓ లొట్టపీసు కేసు అన్న కేటీఆర్ ఇప్పుడు ఏమంటారని ప్రశ్నించారు.
రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెడుతున్నారని హరీష్ రావు, కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని..వారే డైవర్షన్ రాజకీయాలు చేస్తూ మమ్మల్ని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారంటున్నారని మండిపడ్డారు. గతంలో ఇదే మా సీఎం రేవంత్ రెడ్డిపై గత పదేళ్ళలో దాదాపు 100 కేసులు పెట్టారని, మరి అవన్ని రాజకీయ కక్షతోనే పెట్టరా అని ఆది శ్రీనివాస్ నిలదీశారు. కేటీఆర్ సిరిసిల్ల కు వస్తే ప్రతిపక్ష నాయకులను ముందస్తు అరెస్టులు చేశారని గుర్తు చేశారు.
ఫార్ములా ఈ రేసు కేసులో తప్పు చేయలేదని భావిస్తే ఏసీబీ, ఈడీ ముందు విచారణకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. విచారణకు హాజరై తన నిజాయితీని నిరూపించుకోవడం మానేసి, కోర్టుల చుట్టు పిటిషన్లు వేయడం ఎందుకన్నారు. ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు నిధులు మళ్లించి కేటీఆర్ తప్పు చేయడమే కాకుండా బుకాయింపులకు దిగడం సిగ్గుచేటన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పిన కేటీఆర్.. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోయినప్పుడు ఎందుకు సహకరించడం లేదని ఎద్దేవా చేశారు.
చేసిన అవినీతి అక్రమాల వల్లనే కేటీఆర్ ఊచలు లెక్కపెడతారని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రైతు భరోసా ప్రకటన తో రైతులు సంతోషంగా ఉన్నారని..సంతోషంగా లేనిది బీఆర్ఎస్ పార్టీనే అని శ్రీనివాస్ చెప్పారు.