చికెన్ వింగ్స్ దొంగతనం.. 9 ఏళ్ల జైలు శిక్ష

by M.Rajitha |
చికెన్ వింగ్స్ దొంగతనం.. 9 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలోని ఓ ఆహార పంపిణీ కార్యక్రమంలో అక్రమాలు బయట పడ్డాయి. కోవిద్ సమయంలో విద్యార్థులకు అందించాల్సిన చికెన్ వింగ్స్ ను ఓ మహిళా ఉద్యోగి పక్కదారి పట్టించింది. మొత్తం 1.5 మిలియన్ డాలర్ల చికెన్ వింగ్స్ మాయం చేసిన ఈ కేసులో న్యాయస్థానం ఏకంగా 9 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని హార్వే స్కూల్ డిస్ట్రిక్ట్ ఆహార సేవల విభాగంలో వెరా లిడేల్ అనే మహిళ ఉద్యోగం చేస్తూ ఉండేది. కోవిద్ సమయంలో స్కూల్స్ మూసివేసి ఆన్లైన్ క్లాసులు నిర్వహించినా.. విద్యార్థులకు చికెన్ వింగ్స్ తో కూడిన ఆహారాన్ని అందించే కార్యక్రమం కొనసాగించాలని నిర్ణయించారు. కానీ వెరా ఈ చికెన్ వింగ్స్ ను పౌల్ట్రీ నుండి వింగ్స్ తీసుకు వచ్చినా వాటిని విద్యార్థులకు అందించకుండా బయట అమ్మేసుకుందని విచారణలో తేలింది. రెండేళ్లపాటు దాదాపు 15 లక్షల డాలర్ల మోసం జరిగిందని ఆడిటింగ్ లో నిర్ధారించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వెరాను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టారు. కోర్ట్ వెరాకు 9 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Next Story

Most Viewed