- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇకపై ఇంగ్లీష్ మాట్లాడితే రూ. 82 లక్షల జరిమానా.. సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం..!
దిశ, డైనమిక్ బ్యూరో: ఇటలీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏ ఇటాలియన్ వ్యక్తి అయినా మాట్లాడేటప్పుడు ఇటాలియన్ భాష కాకుండా ఇతర భాషలు ఉపయోగిస్తే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అందుకోసం ఏకంగా ఓ ముసాయిదా బిల్లును కూడా తీసుకొచ్చింది. ఆంగ్ల భాషను పూర్తిగా బ్యాన్ చేసే దిశగా వెళ్తున్న తొలి దేశం కూడా ఇటలీయేనని అంటున్నారు.
ఈ మేరకు ఇటలీ ప్రధానమంత్రి, బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ నేత జార్జియా మెలోని ఈ కొత్త ప్రతిపాదిత చట్టాన్ని తెచ్చారు. ఆ చట్టం ప్రకారం ఏ ఇటాలియన్ వ్యక్తి అయినా మాట్లాడేటప్పుడు విదేశీ పదాలను ఉపయోగిస్తే దాదాపు రూ. 4 లక్షల నుంచి రూ. 82 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఈ బిల్లును ఛాంబర్ ఆఫ్ డిప్యూటీ సభ్యుడు ఫాభియో రాంపెల్లి ఆ దేశ పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. దీనికి ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మద్దతు ఇవ్వడం విశేషం.
ఇంగ్లీష్ భాష మీద ప్రజలకు ఉన్న వ్యామోహాన్ని తొలగించడానికి.. తమ భాషను కాపాడుకోవడానికి ఇటలీ ఈ బిల్లును తెచ్చింది. ఆ బిల్లు ప్రకారం, ఇటలీలో ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారెవరైనా రాసేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఇటాలియన్ భాషనే వాడాల్సి ఉంటుంది. ఇంగ్లీష్‌తో సహా ఇతర విదేశీ భాషలను వాడితే భారీ జరిమానా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పదవుల్లో ఉన్న అధికారులు నేతలు ఇటాలియన్ భాషపై నైపుణ్యం కలిగి ఉండాలని ఇటలీ ప్రభుత్వం తేల్చిచెప్పింది.
వ్యాపార సంబంధ లావాదేవీల్లో అధికారిక డాక్యుమెంట్లలో ఇటాలియన్ భాషను తప్పనిసరి చేసింది. ఆంగ్ల పదాల వాడకంపై పూర్తి నిషేధాన్ని విధించింది. ఇటాలియన్ భాష రాని విదేశీయులతో మాట్లాడేటప్పుడు కూడా ఇటాలియన్ భాషనే వాడాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం బిల్లు రూపంలో ఉన్న దీన్ని పార్లమెంటు ఆమోదం అనంతరం పూర్తి స్థాయి చట్టంగా మార్చనున్నారు. ఆ తర్వాత దీన్ని అమలు చేయనున్నారు.
Also Read..