పాక్ 24వ ప్రధానిగా షెహబాజ్ ప్రమాణం

by Hajipasha |
పాక్ 24వ ప్రధానిగా షెహబాజ్ ప్రమాణం
X

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్ 24వ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం పాక్ అధ్యక్ష నివాసమైన ఐవాన్-ఏ-సదర్‌లో జరిగిన కార్యక్రమంలో 72 ఏళ్ల షెహబాజ్‌తో దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ప్రమాణం చేయించారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్(పీఎంఎల్ -ఎన్) పార్టీ, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)లు కలిసి ఈదఫా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దేశంలోని 265 జాతీయ అసెంబ్లీ సీట్లకుగానూ 75 సీట్లను గెల్చుకొని అతిపెద్ద రాజకీయ పార్టీగా పీఎంఎల్ -ఎన్ అవతరించింది. దీంతో సంకీర్ణ సర్కారులో ప్రధాని పదవి పీఎంఎల్ -ఎన్ నేత షెహబాజ్ షరీఫ్‌కే దక్కింది. ప్రధాని అభ్యర్థి ఎంపిక కోసం ఇటీవల నిర్వహించిన ఓటింగ్‌లో పార్లమెంటులోని 336 మంది సభ్యులకుగానూ 201 మంది పీఎంఎల్- ఎన్, పీపీపీ సంకీర్ణానికి మద్దతు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ అనుచరుల గ్రూపు తరఫున ప్రధాని పదవికి పోటీచేసిన ఒమర్ అయూబ్ ఖాన్‌కు 92 ఓట్లే వచ్చాయి.

Advertisement

Next Story