Mrunal Thakur: గార్జియస్ లుక్‌లో సీతారామం బ్యూటీ.. వావ్ అంటున్న నెటిజన్లు

by Kavitha |   ( Updated:2024-12-29 02:18:33.0  )
Mrunal Thakur: గార్జియస్ లుక్‌లో సీతారామం బ్యూటీ.. వావ్ అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: ‘సీతారామం’(Seetharamam) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘హాయ్ నాన్న’(Hi Nanna), ‘ఫ్యామిలీ స్టార్’(Family Star) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ‘హాయ్ నాన్న’ సూపర్ హిట్ అయినప్పటికీ ‘ఫ్యామిలీ స్టార్’ మాత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది. దీంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి.. సోషల్ మీడియా(Social Media)కే పరిమితం అయింది. అక్కడ నిత్యం తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది.

ఈ క్రమంలో ఈ భామ ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా మృణాల్ ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో బ్లూ కలర్ లెహంగాలో స్టన్నింగ్ లుక్స్‌తో ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు.. వావ్, గార్జియస్, స్టిన్నింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ భామ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.

Advertisement

Next Story