- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: మ్యూజిక్ ఈవెంట్‌లో బాంబులు.. 18 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు
దిశ, నేషనల్ బ్యూరో: రష్యాలోని ఓ మ్యూజిక్ ఈవెంట్‌లో శుక్రవారం రాత్రి దుండగులు బాంబులు విసిరారు. ఈ దాడిలో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోగా, వంద మందికి పైగా గాయపడ్డారని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ ఘటన రాజధాని మాస్కో సమీపంలోని కాన్సెర్ట్ హాల్‌లో జరిగింది. స్థానిక మీడియా సంస్థల వివరాల ప్రకారం, క్రాకస్ సిటీ హాల్‌లో మ్యూజిక్ ఈవెంట్ జరుగుతుండగా, ముగ్గురు దుండగులు సైనికుల దుస్తుల్లో వచ్చి ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. బాంబులు సైతం విసిరారు. ఈ దాడిలో కనీసం 18 మృతిచెందినట్టు తెలుస్తుండగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీలో దుండుగులు కాల్పులు జరుపుతుండగా, ఈవెంట్‌కు వచ్చిన జనాలు తీవ్ర భయాందోళనలతో పరుగులు తీస్తున్నారు. మరికొందరు రక్తపు మడుగులో నిశ్చల స్థితిలో పడి ఉన్నారు. మరోవైపు, బాంబు దాడులతో బిల్డింగ్ నుంచి పెద్ద ఎత్తున మంటలు వెలువడ్డాయి. పోలీసులు చేరుకునేలోపే దుండగులు పారిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అక్కడి మీడియా వెల్లడిచింది.