విమానాశ్ర‌యంలో కత్తెర మిస్సింగ్.. 36 విమానాలు రద్దు, 201 విమానాలు ఆలస్యం..!

by Maddikunta Saikiran |
విమానాశ్ర‌యంలో కత్తెర మిస్సింగ్.. 36 విమానాలు రద్దు, 201 విమానాలు ఆలస్యం..!
X

దిశ, వెబ్‌డెస్క్: జ‌పాన్‌ దేశం హొక్కైడోలోని న్యూ చిటోస్ ఎయిర్‌పోర్ట్ దేశీయ టెర్మినల్‌ వద్ద శనివారం జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డొమెస్టిక్ ట‌ర్మిన‌ల్ వ‌ద్ద ఓ దుకాణంలో కత్తెర కనిపించక పోవడంతో హైడ్రామా చోటుచేసుకున్న‌ది. దీంతో భద్రతా కారణాల వల్ల ఏకంగా 36 విమానాల‌ను ర‌ద్దు చేశారు.అలాగే మ‌రో 201 విమానాలు ఆల‌స్యంగా నడిచాయి. బోర్డింగ్ గేటు వ‌ద్ద ఉన్న దుకాణం నుంచి ఈ కత్తెర మిస్ అయ్యింది . దీంతో న్యూ చిటోస్ ఎయిర్‌పోర్ట్ ట‌ర్మిన‌ల్ వ‌ద్ద భారీగా సెక్యూర్టీ చెక్ చేశారు.దాదాపు రెండున్న‌ర గంట‌ల పాటు విమాన సేవ‌ల‌ను నిలిపివేశారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే నిరీక్షించాల్సి వచ్చింది. అయితే చాలా సేపు వెతికినప్పటికీ కత్తెర దొరకకపోవడంతో విమానాల రాకపోకలను అధికారులు పునరుద్దరించారు.

కత్తెర ఏమైంది?

అయితే శ‌నివారం మిస్సైన క‌త్తెర‌ ఆదివారం అదే దుకాణంలో దొరికిన‌ట్లు ఎయిర్‌పోర్టు అధికారి వెల్ల‌డించారు.దుకాణంలో ఒక వర్కర్‌కు ఆ కత్తెర దొరికినట్లు హక్కైడో ఎయిర్‌పోర్టు సోమవారం ప్రకటించింది.హైజాక్‌, ఉగ్ర‌వాదంతో లింకై ఉంటుంద‌న్న ఆలోచ‌న‌తో విమ‌నాల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు హక్కైడో ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ చేప‌ట్టాల‌ని టూరిజం శాఖ మంత్రి ఎయిర్‌పోర్టు అధికారులను ఆదేశించారు.కాగా న్యూ చిటోస్ విమానాశ్ర‌యం జ‌పాన్‌లో అత్యంత ర‌ద్దీ గల విమానాశ్ర‌యాల్లో ఒక‌టి.రోజుకి దాదాపు కొన్ని వేలా మంది ప్రయాణికులు ఈ విమానాశ్ర‌యం నుంచి ఇతర ప్రదేశాలకు ప్రయాణిస్తున్నారు.

Next Story

Most Viewed