- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రగ్ నేరాలపై 12 మందిని ఉరి తీసిన Saudi Arabia ..!
న్యూఢిల్లీ: గత పది రోజుల్లో 12 మంది ప్రజలపై సౌదీ అరేబియా రాజరికం మరణ దండన అమలు చేసినట్లు మీడియా తెలిపింది. మాదక ద్రవ్యాల సరఫరాకు సంబంధించిన నేరాల్లో పాల్గొన్నందుకు వీరిపై ఉరిశిక్ష అమలు చేసినట్లు సమాచారం. వీరిలో కొందరిని కత్తితో తల నరికి చంపారని తెలుస్తోంది. హింసకు పాల్పడని డ్రగ్ నేరాల్లో భాగంగా వారిని అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచి తర్వాత ఉరి తీశారు. వీరిలో ముగ్గురు పాకిస్తాన్‌కి, నలుగురు సిరియాకు, ఇద్దరు జోర్డాన్‌కి చెందిన వలస కార్మికులు కాగా మరో నలుగురు సౌదీ అరేబియా దేశస్తులని మీడియా తెలిపింది.
ఈ మార్చి నెలలోనే సౌదీ అరేబియా వివిధ నేరాల్లో పాల్గొన్న 81 మందిని ఒకేరోజు ఉరితీసి రికార్డు సృష్టించింది. హత్యలు, మిలిటెంట్ గ్రూప్ కార్యకలాపాలు వంటి నేరాలకు వీరిపై మరణ దండన విధించారు. ఆధునిక సౌదీ రాజరిక చరిత్రలో ఇంతమందిని ఒకేరోజు ఉరితీయడం అదే మొదటిసారి. మరణశిక్షలను ముందు ముందు తగ్గిస్తానని రెండేళ్ల క్రితం సౌదీ రాజరిక ప్రభుత్వం ప్రకటించింది. 2018లో టర్కీలోని సౌదీ రాయబార కార్యాలయంలో అమెరికా జర్నలిస్టు జమాల్ కషోగీని సౌదీ యువరాజు ఆదేశాలతో సౌదీ డెత్ స్క్వాడ్ చంపిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించిన నేపథ్యంలో సౌదీ రాజరికం తీవ్ర విమర్శల పాలయింది.