- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రష్యన్ అథ్లెట్ డ్రస్‌పై 'Z' సింబల్! అంత కావరమా..?!
దిశ, వెబ్‌డెస్క్ః రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్తత పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఖతార్‌లోని దోహాలో నిర్వహించిన జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్ ఈవెంట్‌లో ఓ సంఘటన చోటుచేసుకుంది. రష్యన్ జిమ్నాస్ట్ చేసిన పనికి అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ సమాఖ్య (FIG) షాకయ్యింది. గేమ్ ముగిసిన తర్వాత మెడల్స్ పోడియంపై రష్యన్ అథ్లెట్ ఇవాన్ కులియాక్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఉక్రెయిన్‌పై దాడిని సమర్థించే 'Z' గుర్తును తన డ్రస్‌కు తగిలించుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. అయితే, ఈ పోటీలో ఉక్రెయిన్ అథ్లెట్ ఇలియా కోవ్టున్ బంగారు పతకం గెలుచుకోగా, రష్యన్ అథ్లెట్ కాంస్యానికి పరిమితమయ్యాడు.
అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ సమాఖ్య రష్యన్ అథ్లెట్ ఇవాన్ కులియాక్ ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. రష్యన్ జిమ్నాస్ట్‌లను పర్యవేక్షిస్తున్న సంస్థ కూడా కులియాక్ ప్రవర్తన FIG నియమాలను ఉల్లంఘించినట్లు అంగీకరించింది. అయితే ఆ సంస్థ అతని చర్యలకు మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా రష్యన్ అథ్లెట్‌పై క్రమశిక్షణా చర్యలను ప్రారంభించమని జిమ్నాస్టిక్స్ ఎథిక్స్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ (FIG)ను కోరింది. అయితే, సోమవారం నుండి అన్ని రష్యన్, బెలారసియన్ జిమ్నాస్ట్‌లను భవిష్యత్ పోటీల్లో నిషేధిస్తున్నట్లు ఇప్పటికే నిర్ణయించారు.
'Z' దేనికి గుర్తు?
ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యన్ ట్యాంకులు, వాహనాలపై 'Z'ను ముద్రిస్తారు. ఇది రష్యా దండయాత్రకు గుర్తుగా పాటిస్తారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మద్దతుదారులు 'Z' గుర్తు ఉన్న దుస్తులను ధరిస్తుంటారు.