Russia - Ukraine War : పుతిన్ కు ఊహించని షాక్.. రష్యా భూభాగాన్ని ఆక్రమించుకున్న ఉక్రెయిన్..!

by Maddikunta Saikiran |
Russia - Ukraine War : పుతిన్ కు ఊహించని షాక్.. రష్యా భూభాగాన్ని ఆక్రమించుకున్న ఉక్రెయిన్..!
X

దిశ, వెబ్‌డెస్క్ : రష్యా- ఉక్రెయిన్ కు మధ్య గత రెండున్నర ఏళ్లుగా భీకరమైన యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే . ఈ యుద్ధంలో మొన్నటి వరకు ఉక్రెయిన్‌ పై ఆధిపత్యం చలాయిస్తూ వచ్చిన రష్యాకు ఊహించని షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్‌ సేనలు రష్యా భూభాగంలోకి ప్రవేశించాయి. ఈ క్రమంలోనే రష్యాలోని కొన్ని ప్రాంతాలను ఉక్రెయిన్ సైనికులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాదాపుగా 1000 చదరపు కిలోమీటర్ల మేర రష్యా భూభాగం ఉక్రెయిన్ అధీనంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నీ ఉక్రెయిన్‌ సైనిక కమాండర్‌ జనరల్‌ అలెగ్జాండర్ సిర్‌స్కీ వెల్లడించారు. మరోవైపు.. ఉక్రెయిన్‌ సైన్యాలు రష్యాలోకి అడుగుపెట్టినట్లు అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ప్రకటించారు. దీంతో ఉక్రెయిన్‌ సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను రష్యా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది. సురక్షిత ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేశామని, వెంటనే ప్రజలు అక్కడకు చేరుకోవాలని స్థానిక ప్రభుత్వం ప్రజలకు తెలిపింది.ఈ క్రమంలో ఈ రెండు దేశాల మధ్య ఏం జరగబోతుందన్న ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed