ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా 'అతిపెద్ద' డ్రోన్ దాడి

by Mahesh |   ( Updated:2023-05-28 08:43:00.0  )
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా అతిపెద్ద డ్రోన్ దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం గత తొమ్మిది నెలలుగా కొనసాగుతూనే ఉంది. మధ్యలో కొద్దిరోజులు ఈ యుద్ధం తగ్గుముఖం పట్టినప్పటికీ తిరిగి మళ్లీ భీకర రూపం దాల్చుతుంది. ఈ క్రమంలోనే.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా వైమానిక దాడులను ప్రారంభించింది. కాగా ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి.. జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడుల్లో ఇదే పెద్ద దాడిగా.. అధికారులు తెలిపారు. రష్యా ప్రయోగించిన 54 డ్రోన్‌లలో 52 విమానాలను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. ఇరాన్ తయారు చేసిన 'కామికేజ్' డ్రోన్‌లతో ఇది రికార్డ్ దాడిగా పేర్కొంది. ముఖ్యంగా, రాజధాని కైవ్ దినోత్సవాన్ని జరుపుకునే మే చివరి ఆదివారం ఈ దాడి జరిగిందని వారు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed