- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బరాక్ ఒబామాపై రష్యా నిషేధం
దిశ, వెబ్ డెస్క్: ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో తమ దేశంపై ఆంక్షలు విధిస్తున్న పశ్చిమ దేశాలపై రష్యా ప్రతి చర్యలకు పూనుకొంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సహా 500 మంది అమెరికన్లకు తమ దేశంలోకి ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు రష్యా తెలిపింది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో యూఎస్ చట్టసభ సభ్యులు, మాజీ రాయబారులు కూడా ఉన్నారు. అయితే ఏ కారణంగా నిషేధం విధించారనే విషయాన్ని మాత్రం రష్యా ఎక్కడా స్పష్టం చేయలేదు.
దీంతో పాటు బంధీగా ఉన్న వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గెర్ ష్కోవిచ్ కు కాన్సులర్ యాక్సెస్ ఇవ్వాలని అమెరికా చేసిన అభ్యర్థనను కూడా రష్యా తిరస్కరించింది. ఇక రష్యా బ్యాన్ చేసిన అమెరికాకు చెందిన వాళ్లలో టెలివిజన్ హోస్ట్స్ స్టీఫెన్ కోల్డెర్ట్, జిమ్మీ కిమ్మెల్, సేత్ మెయర్స్, సీఎన్ఎన్ యాంకర్ ఎరిన్ బర్నెట్, ఎమ్ఎస్ఎన్బీసీ ప్రెజెంటర్స్ రాచెల్ మ్యాడో, జో స్కార్బోరఫ్ తదితరులు ఉన్నారు. కాగా 2009 జనవరి 20 నుంచి 2017 జనవరి 20 వరకు రెండు పర్యాయాలు ఒబామా అమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరించారు.