Right to disconnect: డ్యూటీ తర్వాత మీ బాస్ ను మర్చిపోండి.. త్వరలో అక్కడ రైట్ టూ డిస్ కనెక్ట్ చట్టం

by Prasad Jukanti |   ( Updated:2024-08-23 11:36:12.0  )
Right to disconnect: డ్యూటీ తర్వాత మీ బాస్ ను మర్చిపోండి.. త్వరలో అక్కడ రైట్ టూ డిస్ కనెక్ట్ చట్టం
X

దిశ, డైనమిక్ బ్యూరో: వర్క్ కల్చర్ లో వస్తున్న మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు తమ వ్యక్తిగత జీవితాలకు దూరం అవుతున్నారని అనేక సర్వేలు చెబుతున్నాయి. అయినా ఈ పోటీ ప్రపంచంలో ఇంటికి వెళ్లినా ఆఫీస్ పనుల భారం తప్పడం లేదు. దీంతో ఇటు ఇల్లు, అటు ఆఫీసు పనులు కలగలిపి ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఇటువంటి తరుణంలో వచ్చే సోమవారం నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉద్యోగుల సంరక్షణ కోసం సరికొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నది. 'రైట్ టూ డిస్ కనెక్ట్' పేరుతో కొత్త చట్టాన్ని అమలు చేయాలని భావిస్తున్నది. దీని ప్రకారం పని గంటలు పూర్తయిన తర్వాత ఉద్యోగులు తమ బాసులను పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా కొత్త రూల్స్ తీసుకురాబోతున్నారు. ఎంప్లాయిస్ తమ ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకుని పూర్తిగా వ్యక్తిగత జీవితానికి పరిమితం అయ్యేలా ఈ నిబంధనలు తీసుకుబోతున్నారు. వాస్తవానికి ఆస్ట్రేలియా పార్లమెంట్ గత ఫిబ్రవరిలోనే ఉద్యోగుల వ్యక్తిగత జీవితాన్ని సంరక్షించేలా, ఆఫీసు నుంచి దూరంగా వ్యక్తిగత జీవితం గడిపేలా ఈ కొత్త చట్టాన్ని పాస్ చేసింది. కానీ ఈ చట్టం అమలుపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ విధానం ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ తదితర ఐరోపా దేశాల్లో అమల్లో ఉంది.

Advertisement

Next Story