- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ రష్యా అధ్యకుడిగా పుతిన్.. 88 శాతం ఓట్లతో అధ్యక్ష పీఠం కైవసం
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న దేశాల్లో పేరులో రష్యా మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తీసుకునే నిర్ణయాలు యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పుతిన్ తీసుకున్న ప్రతి నిర్ణయం తో ఏదో ఒక వివాదానికి దారి తీస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఆయన ఉక్రేయిన్ పై యుద్ధం ప్రకటించి సంచలనం గా మారారు. ఎన్ని దేశాలు చెప్పిన ఆయన వినకుండా ఉక్రెయిన్ పై నేటికి యుద్ధ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రష్యా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారీ మెజారిటీతో గెలిచి మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో పుతిన్ కే ఏకంగా 88 శాతం ఓట్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొదటి నుంచి ఏకపక్షంగా సాగిన ఎన్నికల్లో ముగ్గురు ప్రత్యర్థులు పుతిన్ కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. ఈ ఎన్నికలకు ముందు రష్యాలోని ప్రధాన రాజకీయ నాయకుడు అయిన అలెక్సీ నావల్నీ మరణించడంతో అధ్యక్షుడు పుతిన్ కు తిరుగులేకుండా పోయింది. దీంతో ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఆయన మరో ఆరు సంవత్సరాల పాటు అధ్యక్ష పదవిలో పుతిన్ కొనసాగనున్నారు.