- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘వీటో’ పవర్‌తో ఉగ్రవాదులను రక్షించారు: యూఎన్ఎస్సీలో తీవ్రంగా ఖండించిన భారత్
దిశ, నేషనల్ బ్యూరో: వీటో అధికారాన్ని ఉపయోగించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో ఉగ్రవాదుల పేర్లను చేర్చడానికి నిరాకరించిన దేశాల తీరును భారత్ తీవ్రంగా ఖండించింది. యూన్ఎస్సీ సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ..ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంతో భద్రతా మండలి కీలక పాత్ర పోషించాలని తెలిపారు. కానీ ఈ తరహా చర్యలు సరికావని స్పష్టం చేశారు. టెర్రరిజాన్ని ఎదుర్కొంటామని యూఎన్ఎస్సీ హామీ ఇచ్చిందని..కానీ పలు దేశాలు వీటిని అడ్డుకున్నాయని చెప్పారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థల నాయకత్వానికి సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఉందని మరోసారి అభిప్రాయపడ్డారు. ప్రపంచ భద్రతకు ముప్పు ఏర్పడిన టైంలో యూఎన్ఎస్సీ స్పష్టమైన కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
26/11 ముంబై ఉగ్రదాడులతో ప్రమేయమున్న లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్‌ను టెర్రిరిస్టుల జాబితాలో చేర్చాలని గతేడాది భారత్, అమెరికా సంయుక్తంగా యూఎన్ఎస్సీలో ప్రతిపాదించారు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ 1267 అల్-ఖైదా ఆంక్షల కమిటీ సమావేశంలో యూఎస్ ఈ ప్రతిపాదనను సమర్పించింది. అయితే వీటో అధికారాన్ని ఉపయోగించి చైనా దానిని తిరస్కరించింది. 2022లోనూ మరో ఉగ్రవాది మౌలానా మసూద్ అజర్ సోదరుడు అబుల్ రవూఫ్ అస్గర్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని అమెరికా, భారత్ తీసుకొచ్చిన ప్రతిపాదనను చైనా వ్యతిరేకించింది. ఈ క్రమంలోనే తాజాగా భారత్ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. కాగా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్యదేశాలైన చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, అమెరికాలు వీటో పవర్ కలిగి ఉన్నాయి.