- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెక్సికో, కెనడా, ఫ్రాన్స్‌లకు వ్యాపించిన పాలస్తీనా అనుకూల నిరసనలు
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా యూనివర్శిటీల్లో పాలస్తీనా అనుకూల నిరసనలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. గురువారం ఉదయం కాలిఫోర్నియా యూనివర్శిటీలో నిరసనకారులను చెదరగొట్టి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ గాజాపై దాడులు ఆపాలని జరుగుతున్న నిరసనలు మెక్సికో, కెనడా, ఫ్రాన్స్‌లకు వ్యాపించాయి. మెక్సికో, కెనడాలోని విద్యార్థులు కూడా ఇజ్రాయెల్ శాశ్వత కాల్పుల విరమణను చేపట్టాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో నిరసనలు చేస్తున్నారు.
నేషనల్ అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికోలోని విద్యార్థులు నగరంలోని ఒక సంస్థ ప్రధాన కార్యాలయం ముందు నిలబడి "లాంగ్ లివ్ ఫ్రీ పాలస్తీనా" అని నినాదాలు చేశారు, అలాగే గాజాపై దాడులు చేస్తున్నవంటి ఇజ్రాయెల్‌తో దౌత్య, వాణిజ్య సంబంధాలను తెంచుకోవాలని వారు మెక్సికన్ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, పాలస్తీనా అనుకూల విద్యార్థులు టొరంటో విశ్వవిద్యాలయం, బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం, ఒట్టావా విశ్వవిద్యాలయంలో శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఇజ్రాయెల్‌పై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఫ్రాన్స్‌లో కూడా ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో నిరసనలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌తో సంబంధాలను తెంచుకోవాలని ఆయా దేశాల్లో నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు. విశ్వవిద్యాలయాలు చదువుకోడానికి మాత్రమే ఉద్దేశించినవి, వీటిని నిరసనల కోసం ఉపయోగించకూడదని, క్యాంపస్‌లో ఎలాంటి శిబిరాలను ఏర్పాటు చేయవద్దని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తెలిపారు.