పోర్చుగల్ ప్రధాని రాజీనామా: అవినీతి ఆరోపణలే కారణం

by samatah |
పోర్చుగల్ ప్రధాని రాజీనామా: అవినీతి ఆరోపణలే కారణం
X

దిశ, నేషనల్ బ్యూరో: పోర్చుగల్ ప్రధానమంత్రి ఆంటోనియో కోస్టా తన పదవికి రాజీనామా చేశారు. కోస్టా 2015 నుంచి దేశంలో అధికారంలో ఉన్నారు. మొదట సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ఆయన 2022 ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించి పీఎంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే గతేడాది లిథియం గనులు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులో అవినీతి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆంటోనియో నివాసంపై పోలీసులు దాడి చేశారు. అనంతరం ఆయన ముఖ్య సలహాదారున్ని అరెస్టు చేశారు. ఈ కేసులో భాగంగా కోస్టా సైతం విచారణలో ఉన్నట్టు తెలిపారు. అయితే ఈ ఆరోపణలను కోస్టా ఖండించారు. ఈ నేపథ్యంలోనే పీఎం పదవికి రాజీనామా చేశారు. దర్యాప్తునకు సహకరిస్తానని చెప్పిన కోస్టా..మళ్లీ ప్రధాని పదవికి పోటీ చేయబోనని తేల్చి చెప్పారు. సోషలిస్టు పార్టీ నేతలు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కోస్టా రాజీనామాను ఆమోదించిన పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డిసౌసా పార్లమెంట్ రద్దు చేయడానికి కౌన్సిల్‌ను సమావేశపర్చారు. అయితే కొత్త ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించలేదు. కాగా, కోస్టా హయాంలో పోర్చుగల్ బలమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఐరోపాలోనే అత్యుత్తమ పనితీరు కనబర్చింది. ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ 2శాతం వృద్ధితో ముగుస్తుందని అంచనా ఉంది.

Next Story

Most Viewed