కాలిఫోర్నియా యూనివర్శిటీలో నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

by Disha Web Desk 17 |
కాలిఫోర్నియా యూనివర్శిటీలో నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాలిఫోర్నియా యూనివర్శిటీ క్యాంప‌స్‌లో ఇజ్రాయిల్-పాలస్తీనా అనుకూల మద్దతుదారుల మధ్య బుధవారం ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున వందలాది మంది పోలీసులు క్యాంపస్ లోపలికి ప్రవేశించి నిరసనకారులు ఏర్పాటు చేసుకున్న శిబిరాలను తొలగించి వారిని చెదరగొట్టారు. ఉదయం 3.15 గంటల ప్రాంతంలో పోలీసులు షీల్డ్‌లు, లాఠీలతో నిరసకారులపై లాఠీ చార్జ్ చేశారు. అడ్డంగా ఉన్నటువంటి భారీకేడ్లు తొలగించి, కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పలుమార్లు లౌడ్‌స్పీకర్‌లో నిరసనకారులకు హెచ్చరికలు జారీ చేశారు. అందరిని లోపలికి వెళ్లాలని, తమ శిబిరాలను తొలగించాలని సూచించగా అందుకు వారు నిరాకరించడంతో నిరసనకారులు అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

వారిని చెదరగొట్టే క్రమంలో భాగంగా కొంతమందికి గాయాలయ్యాయి. బుధవారం ఇజ్రాయిల్-పాలస్తీనా మద్దతుదారులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పెప్పర్ స్ప్రే, కర్రలు, రాళ్ళు, మెటల్ ఫెన్సింగ్‌లతో దాడి చేసుకోవడంతో 100 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కొంతమందికి తీవ్రంగా గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఈ అలజడులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు వారి శిబిరాలను తొలగించడానికి గురువారం తెల్లవారుజామును తమ ఆపరేషన్‌ను ప్రారంభించారు. యూనివర్శిటీలో గత కొంత కాలంగా క్యాంపస్‌కు సంబంధం లేని వారు లోపలికి ప్రవేశించి ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తున్నారని క్యాంపస్ అధికారులు పేర్కొంటున్నారు.

Next Story

Most Viewed