PM Modi: బ్రూనైలో ప్రఖ్యాత ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును సందర్శించిన ప్రధాని మోడీ

by Maddikunta Saikiran |
PM Modi: బ్రూనైలో ప్రఖ్యాత ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును సందర్శించిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్(India)- బ్రూనై(Brunei) దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) బ్రూనైలో తన పర్యటనను కొనసాగిస్తున్నారు. రెండు రోజుల పర్యటన సందర్భంగా మోడీ ఈరోజు ప్రఖ్యాత ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును సందర్శించారు. బ్రూనైలో అత్యంత ప్రసిద్ధ కట్టడాల్లో ఒకటిగా ఇది పేరు గాంచింది.కాగా ఒమర్ అలీ సైఫుద్దీన్(Omar Ali Saifuddien) ప్రస్తుత సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియా(Haji Hassanal Bolkiah) యొక్క తండ్రి. ఆధునిక బ్రూనై ఆర్కిటెక్ట్‌గా ఒమర్ అలీని అక్కడి ప్రజలు పేర్కొంటారు. ఈ క్రమంలో మసీదు చరిత్రకు సంబంధించిన వీడియోను అక్కడి మంత్రులతో కలిసి వీక్షించారు.



ఈ పర్యటనలో భాగంగా మోడీ బ్రూనైలోని భారత హైకమిషన్ కొత్త భవనాన్ని ప్రారంభించారు.కాగా భారత్ యొక్క కొత్త హైకమిషన్ భవనం జలాన్ దూటా డిప్లొమాటిక్ ఎన్‌క్లేవ్‌లోని యుఎస్ ఎంబసీకి ఆనుకుని ఉంది.ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ . జైశంకర్ తో పాటు జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అక్కడికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన స్థానిక అధికారులు, భారతీయులతో ప్రధాని మోదీకాసేపు సంభాషించారు.ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు భారతీయులు అందిస్తున్న సహకారాన్ని మోడీ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed