- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇరాన్‌పై పాక్ ప్రతీకార దాడి!: నలుగురు పిల్లలు, ముగ్గురు మహిళల మృతి
దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ భూభాగంలోని బలూచిస్తాన్ ప్రావీన్సులో జైషే ఆల్ ఆద్ల్ తీవ్రవాద స్థావరాలపై ఇరాన్ దాడి చేయగా.. తీవ్ర పరిణామాలుంటాయని పాక్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ఇరాన్‌పై గురువారం ప్రతీకార దాడికి పాల్పడినట్టు ఇరాన్ మీడియా పేర్కొంది. సవరణ్ నగరంలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్టు పేర్కొంది. అయితే ఇంటెలిజెన్స్ ఆధారిత ‘మార్గ్ బార్ శర్మాచార్’ అనే పేరుతో జరిగిన ఈ ఆపరేషన్‌లో అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్‌లోని పాక్ వ్యతిరేక తీవ్రవాద గ్రూపులపై ఎటాక్ చేసినట్టు స్పష్టం చేసింది. కానీ పాక్ దాడిలో నలుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు మరణించారని ఇరాన్ వెల్లడించింది. మరోవైపు ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై భారత్ స్పందిస్తూ..‘ఆత్మరక్షణ కోసం ఇరు దేశాలు తీసుకుంటున్న చర్యలను’ అర్థం చేసుకున్నట్టు తెలిపింది. ఇరాక్, సిరియా, పాకిస్థాన్‌లలో ఇరాన్ దాడులను ఖండిస్తున్నట్టు అమెరికా పేర్కొంది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని పాకిస్థాన్, ఇరాన్‌లను చైనా కోరింది.