- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pakisthan: స్కూల్ వ్యాన్‌పై ఉగ్రవాదుల కాల్పులు.. ఇద్దరు చిన్నారులు మృతి
దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు గురువారం ఓ పాఠశాల వ్యాన్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన పిల్లలను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్త చేపట్టినట్టు పోలీసు ఉన్నతాధికారి ఘియాస్ గుల్ తెలిపారు. మరణించిన బాలికలు పదేళ్ల వయస్సుగల వారని వెల్లడించారు. అయితే ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. మరోవైపు డ్రైవర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్టు తెలుస్తోంది. దీంతో డ్రైవర్‌కు ఎవరితోనైనా శత్రుత్వం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ ఘటనపై పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, మంత్రి మొహసోయిన్ నఖ్వీ స్పందించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా, ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌లో ఉగ్ర దాడులు పెరిగాయి. ఇందులో ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న వాయువ్య ప్రాంతంలోనే చోటు చేసుకున్నాయి. 2014లో వాయువ్య నగరంలోని పెషావర్‌లోని ఆర్మీ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలపై పాకిస్థాన్ ఉగ్రవాదులు అత్యంత దారుణంగా దాడి చేసి 132 మంది చిన్నారులతో సహా 147 మందిని హతమార్చారు.