భారీ వర్షాలతో పాకిస్థాన్ అతలాకుతలం..!

by Maddikunta Saikiran |
భారీ వర్షాలతో  పాకిస్థాన్  అతలాకుతలం..!
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దక్షిణ పాకిస్తాన్‌లో కుండపోత వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.కాగా జూలై 1 నుండి కురిసిన వర్షాలకు 209 మందికి పైగా చనిపోయారు.పంజాబ్ ప్రావిన్స్‌లో గడిచిన 24 గంటల్లో 14 మంది మరణించారని ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారి ఇర్ఫాన్ అలీ తెలిపారు. అలాగే ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్ ప్రావిన్సులలో కూడా మరణాలు సంభవించాయి. దక్షిణ పాకిస్థాన్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా సింధ్ ప్రావిన్స్‌లోని సుక్కుర్ జిల్లాలో వీధులన్నీ జలమయమయ్యాయి.ఇటీవలి సంవత్సరాలలో భారీ వర్షాలు కురవడానికి వాతావరణ మార్పులే కారణమని శాస్త్రవేత్తలు ,వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ వారం కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని పాకిస్థాన్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి జహీర్ అహ్మద్ బాబర్ తెలిపారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు వరద ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Next Story

Most Viewed