ఆస్కార్.. ‘లాపతా లేడీస్’ మూవీ పేరు మార్పు.. కొత్త పోస్టర్ విడుదల చేసిన మేకర్స్

by Hamsa |   ( Updated:2024-11-15 15:41:48.0  )
ఆస్కార్.. ‘లాపతా లేడీస్’ మూవీ పేరు మార్పు.. కొత్త పోస్టర్ విడుదల చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్(Aamir Khan) ప్రొడక్షన్‌లో ఆయన మాజీ భార్య కిరణ్ రావ్(Kiran Rao) తెరకెక్కించిన చిత్రం ‘లాపతా లేడీస్’(Lapata Ladies). ఇందులో స్పర్శ శ్రీవాస్తవ్ హీరోగా నటించగా భోజ్‌పురి నటుడు రవి కిషన్(Ravi Kishan) కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా మార్చి 1న థియేటర్స్‌లో విడుదలై విజయం సాధించింది. అంతేకాకుండా పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు రాబట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే కోర్టు అడ్మినిస్ట్రేటివ్ వేడుకల్లోనూ ప్రదర్శించిన చిత్రంగా నిలిచింది.

అంతేకాకుండా ఇటీవల ‘లాపతా లేడీస్’(Lapata Ladies) ఓ అరుదైన ఘనతను సాధించింది. 2025 ఆస్కార్ పురస్కారాలకు మన దేశం నుంచి అధికారికంగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘లాపతా లేడీస్’ మేకర్స్ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా మూవీ టైటిల్‌ను కూడా మార్చేశారు. ‘లాస్ట్ లేడీస్’ అనే పేరుతో క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా షేర్ చేశారు.


👉 Click Here For Tweet!



Advertisement

Next Story

Most Viewed