షుగర్ లెవల్స్ పెరగాడానికి ఒత్తిడి కారణమా..?

by Kanadam.Hamsa lekha |
షుగర్ లెవల్స్ పెరగాడానికి ఒత్తిడి కారణమా..?
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో ఎక్కువమంది ఎదుర్కొంటున్న సమస్య ఒత్తిడి. చదువుకునే పిల్లల నుంచి ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు వరకు రోజువారి జీవితంలో అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. ఇది మానసిక, శారీరక ఆరోగ్య సమస్యకు కారణమవుతుంది. స్ట్రెస్ కారణంగా కార్డిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లు ఎక్కువగా విడుదల అవుతాయి. ఫలితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే, నెగిటివ్ ఎమోషన్స్ నుంచి రిలీఫ్ అవ్వడం కోసం చాలామంది ఆహారంను తీసుకుంటారు. చక్కెర, కొవ్వు, కేలరీలు ఉన్న ఫుడ్ ఎక్కువగా తింటారు. ఇలా ఒత్తిడికి కారణంగా తీసుకునే ఫుడ్ ఆహార అలవాట్లను ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడి శరీరంలోని ఆకలిని పెంచడానికి లేదా తగ్గడానికి కారణమవుతుంది. దీంతో కొందమంది అనారోగ్యకరమైన ఫుడ్ తినాలనే కోరికలు పెరుగుతాయి. మరికొందరికి ఏమీ తినాలని అనిపించకపోవచ్చు. ఇలాంటి ప్రభావాలు మధుమేహం ఉన్న వారికి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. అంతేకాకుండా ఒత్తిడి కారణంగా గ్లూకాగన్ అనే హార్మోన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇది కాలేయం నుంచి గ్లూకోజ్‌ని రిలీజ్ చేసేందుకు ప్రేరేపిస్తుంది. దీని వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా పెరుగుతాయి. శరీరంలోని ఇన్సులిన్ కూడా సరిగా స్పందించదు.

ఆహారపు అలవాట్లు:

ఒత్తిడి అనేది షుగర్ ఉన్నవారికి ఎక్కువగా తినాలని అనిపిస్తుంది. ఆ కారణంగా హై కోర్బోహైడ్రేట్, హై షుగర్ ఉండే ఫుడ్‌ను తినాలని అనుకుంటారు. దీంతో, షుగర్ లెవల్స్ కంట్రోల్‌‌లో ఉండవు, బ్యాలెన్స్ తప్పుతాయి. ఒత్తిడి మెదడు పనితీరును, సెల్ఫ్ కంట్రోల్‌ను దెబ్బతీస్తుంది. షుగర్ ఉన్న వారు రక్తంలో చక్కెర స్థాయిల గురించి పట్టించుకోకుండా అతిగా తీపి పదార్థాలను తినే అవకాశం ఉంటుంది. ఒత్తిడిని అనుభవించే వారిలో కార్టిసాల్, అడ్రినలిన్ హార్మోన్లు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. షుగర్ ఉన్న వ్యక్తులలో ఇన్సులిన్ సెన్సిటివిటీ మెటాబాలిజం ప్రభావితం అవుతుంది. దీని వల్ల కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా పెరిగి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్యకు కారణం అవుతుంది. దీని వల్ల వారి పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంటుంది.

ఒత్తిడిని ఇలా తగ్గించుకోండి:

రెగ్యులర్‌గా 30 నిమిషాల పాటు వ్యాయమం చేయడం వల్ల శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీ కంట్రోల్‌ ఉంటుంది. వ్యాయామం ద్వారా బరువు అదుపులో ఉండి, షుగర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫిజికల్ యాక్టివిటీతో కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. రోజువారి దినచర్యలో కొన్ని విషయాలపై శ్రద్ధ చూపడం మంచిది. ప్రతీ రోజు రక్తంలోని చక్కెరస్థాయిని తప్పకుండా చెక్ చేసుకోండి. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటిన్లు వంటివి తినడం అవాటు చేసుకోవాలి. క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story