లగచర్ల దాడి కేసు: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

by srinivas |   ( Updated:2024-11-13 07:19:05.0  )
లగచర్ల దాడి కేసు: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: లగచర్ల దాడి కేసు(Lagacharla Attack Case)లో పోలీసులు దూకుడు పెంచారు. మొత్తం 55 మందిని విచారించిన పోలీసులు 31 మందిని నిందితులుగా చేర్చారు. ఈ మేరకు రిమాండ్ రిపోర్టు రెడీ చేశారు. ఇప్పటికే 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం ఉదయం హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో కొండగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి(Kondagal former MLA Narender Reddy) అదుపులోకి తీసుకుని వికారాబాద్(Vikarabad) డీటీసీ కార్యాలయంలో ఎస్పీ అధ్వర్యంలో విచారిస్తున్నారు. ఏ1 నిందితుడు సురేశ్(A1 Accused Suresh) కోసం గాలిస్తున్నారు. ఫార్మా కంపెనీకి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ వచ్చిన కలెక్టర్, ఇతర అధికారులపై దాడి చేయాలని ముందుగానే ప్లాన్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. లగచర్ల వద్ద అధికారులపై కారం, కర్రలు, రాళ్లతో అధికారులపై దాడి చేసేందుకు ముందుగానే ప్లాన్ చేశారని పేర్కొన్నారు.

అసలు ఫార్మా కంపెనీ ఏర్పాటుపై వికారాబాద్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తే సురేశ్ అక్కడి వెళ్లి లగచర్లకు రావాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. లగచర్లకు వస్తే ప్రజలు సానుకూలంగా స్పందిస్తారని, అందువల్ల అక్కడికి రావాలని అధికారులకు సురేశ్ తో పాటు కొంతమంది తెలిపినట్లు చెప్పారు. సురేశ్ మాటల విని లగచర్లకు అధికారులు వెళ్లారని, ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే దాడి చేశారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Next Story