CM Revanth Reddy: దొరల దమననీతికి వ్యతిరేకంగా కలం ఎత్తిన యోధుడు.. కాళోజీకి సీఎం రేవంత్ నివాళి

by Prasad Jukanti |
CM Revanth Reddy: దొరల దమననీతికి వ్యతిరేకంగా కలం ఎత్తిన యోధుడు.. కాళోజీకి సీఎం రేవంత్ నివాళి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజా కవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు (Kaloji) వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఘన నివాళి అర్పించారు. 'నిజాం నిరంకుశత్వానికి, దొరల దమననీతికి వ్యతిరేకంగా కలం ఎత్తిన యోధుడు కాళోజీ.., పుట్టుక నీది - చావు నీది బతుకంతా దేశానిది…అని సేవకు స్ఫూర్తి నింపిన మహనీయుడు' అని కాళోజీ సేవలను సీఎం కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా నివాళి అర్పించారు.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సైతం కాళోజీ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు. 'పుట్టుక నీది, చావు నీది…బ్రతుకంతా దేశానిది అనేంత గొప్పగా జీవించిన చైతన్య శీలి.. హక్కులకోసం, తెలంగాణ భాష, సంస్కృతుల కోసం నియంత నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించిన చలనశీలి… తెలంగాణ గొంతుకై నినదించిన ధీశాలి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు'.. అంటూ ఆయన్ను స్మరించుకున్నారు.

మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) సైతం కాళోజీకి నివాళి అర్పించారు. మహోన్నతమైన తెలంగాణ అస్తిత్వాన్ని, సాహిత్య సాంస్కృతిక గరిమను ప్రపంచానికి చాటేందుకు కవిగా తన కలాన్ని గళాన్ని మొత్తంగా తన జీవితాన్ని తెలంగాణ కోసం అర్పించిన కాళోజీ కృషి చిరస్మరణీయమని కొనియాడారు.

Advertisement

Next Story

Most Viewed