ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అక్కడ కలుసుకున్న ప్రభాస్, అనుష్క..? నెట్టింట వైరల్ అవుతోన్న న్యూస్

by Kavitha |   ( Updated:2024-11-13 14:55:03.0  )
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అక్కడ కలుసుకున్న ప్రభాస్, అనుష్క..? నెట్టింట వైరల్ అవుతోన్న న్యూస్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty)ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ కలిసి ‘బిల్లా’(Billa), ‘మిర్చి’(Mirchi), ‘బాహుబలి 1’(Bahubali 1), ‘బాహుబలి 2’(Bahubali 2) సినిమాల్లో జంటగా నటించారు. ఇక వీరి నటనకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా అనుష్క, ప్రభాస్ జంట ఎవర్ గ్రీన్ పెయిర్ అనే చెప్పాలి. దీంతో వీరిద్దరూ లవ్‌లో ఉన్నారంటూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు గతంలో చాలా రూమర్స్ వినిపించాయి. కానీ దీనిపై ప్రభాస్ కానీ, అనుష్క కానీ స్పందించలేదు. అ నేపథ్యంలో వీరిద్దరికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ప్రభాస్ అనుష్క సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా ఇద్దరూ తరచూ కలుస్తుంటారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో తాజాగా అనుష్క నటిస్తోన్న ‘ఘాటీ’(Ghaati) మూవీ సెట్స్‌కి కూడా డార్లింగ్ వెళ్లినట్లు తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా గతంలో ‘భాగమతి’(Bhagamathi) మూవీ సెట్‌లోనూ వీరిద్దరూ కలుసుకున్న సంగతి తెలిసిందే.


Read More..

Prabhas: బట్టతలతో దర్శనమిచ్చిన ప్రభాస్.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన డార్లింగ్ ఫొటో

Advertisement

Next Story