Pakistan : 26వ రాజ్యాంగ సవరణ దిశగా పాక్.. ఎందుకంటే ?

by Hajipasha |
Pakistan : 26వ రాజ్యాంగ సవరణ దిశగా పాక్.. ఎందుకంటే ?
X

దిశ, నేషనల్ బ్యూరో : 26వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించే దిశగా పాకిస్తాన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. న్యాయ వ్యవస్థ అధికారాలకు కోత పెట్టే పలు వివాదాస్పద సవరణలు ఈ బిల్లులో ఉన్నాయని అంటున్నారు. ఈ సవరణలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా.. 26వ రాజ్యాంగ సవరణ బిల్లు ముసాయిదాను ఆదివారం ఉదయం పాకిస్తాన్ క్యాబినెట్ ఆమోదించింది. అనంతరం దీన్ని పాకిస్తాన్ పార్లమెంటులోని ఎగువ సభ (సెనేట్‌)లో న్యాయశాఖ మంత్రి ఆజం నాజిర్ తరార్ ప్రవేశపెట్టారు. దీనిపై సెనేట్‌లో సుదీర్ఘ చర్చ జరగనుంది. అన్ని పార్టీల ముఖ్య నేతల అభిప్రాయాలను సేకరించనున్నారు.

సెనేట్‌లో ఆమోదించిన అనంతరం 26వ రాజ్యాంగ సవరణ బిల్లును దిగువ సభకు (నేషనల్ అసెంబ్లీ) పంపనున్నారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే రెండుసభల్లోనూ మూడింట రెండోవంతు మెజారిటీ ఓట్లతో ఆమోదం పొందాల్సి ఉంటుంది. కాగా, ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే జడ్జీల పదవీ విరమణ వయో పరిమితులు పెరగనున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలాన్ని నిర్ణీత సంవత్సరాలకు పరిమితం చేయనున్నారు.

Advertisement

Next Story