Pakistan : పాకిస్తాన్‌లో ఘోరం.. పోలీస్ వ్యానుపై దుండగుల రాకెట్ల దాడి

by Maddikunta Saikiran |
Pakistan : పాకిస్తాన్‌లో ఘోరం.. పోలీస్ వ్యానుపై దుండగుల రాకెట్ల దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: గురువారం పాకిస్తాన్‌లోని ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. పంజాబ్ ప్రావిన్స్‌లో పోలీసులపై దుండగులు రాకెట్లతో దాడి చేశారు. లాహోర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రహీమ్ యార్ ఖాన్ జిల్లాలో మచా పాయింట్ రోడ్డు మార్గంలో రెండు పోలీసు వ్యాన్లు ప్రయణిస్తున్నాయి. ఈ క్రమంలో వారి వాహనాలు బురదలో చిక్కుకపోయాయి.ఇదే అదునుగా భావించి దుండగులు అక్కడికి చేరుకుని వారి వాహనాలపై రాకెట్లతో దాడి చేశారు. ఈ దాడిలో కనీసం 11 మంది పోలీసులు అక్కడికక్కడే మరణించారని అలాగే కొందరు గాయపడ్డారని ,కొందరు బందీలుగా పట్టుబడ్డారని పంజాబ్ పోలీసు ప్రతినిధి ఒకరు తెలిపారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

అయితే దాడి జరిగిన సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను రహీమ్ యార్ ఖాన్‌లోని షేక్ జాయెద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.కాగా దాడి అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దుండగుల చేతిలో బందీలుగా ఉన్న పోలీసులను పట్టుకునేందుకు వెంటనే ఆపరేషన్ ప్రారంభించాలని ఐజీ పోలీసు డాక్టర్ ఉస్మాన్ అన్వర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Advertisement

Next Story