భారత్ ఇచ్చిన విమానాలను మా పైలట్లు నడపలేరు: మాల్దీవుల మంత్రి ఘసన్ మౌమూన్

by samatah |
భారత్ ఇచ్చిన విమానాలను మా పైలట్లు నడపలేరు: మాల్దీవుల మంత్రి ఘసన్ మౌమూన్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ తమ దేశానికి బహుమతిగా ఇచ్చిన మూడు సైనిక విమానాలను నడిపే సామర్థ్యం తమ పైలట్లకు లేదని మాల్దీవుల మంత్రి ఘసన్ మౌమూన్ తెలిపారు. విమానాన్ని నడిపేందుకు లైసెన్స్ పొందిన వ్యక్తులు తమ వద్ద లేరని వెల్లడించారు. ఈ మేరకు ఆయన మాలేలో మీడియాతో మాట్లాడారు. భారత్ మాల్దీవులకు రెండు హెలికాఫ్టర్లు, ఒక డోర్నియర్ విమానాన్ని విరాళంగా ఇచ్చినట్టు తెలిపారు. కానీ వీటిని నడిపేందుకు పైలట్లు లేరని స్పష్టం చేశారు. అయితే మాల్దీవుల సైనికులకు భారత్ శిక్షణ కూడా ప్రారంభించిందని వివిధ కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోయిందని చెప్పారు. కాబట్టి వాటిని నడిపే వారు లేకుండా పోయారని వెల్లడించారు. వీటిని ఆపరేట్ చేసేందుకు వివిధ దశల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని చెప్పారు. కాగా, మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ ముయిజ్జు బాధ్యతలు చేపట్టాక భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. భారత్ బలగాలు మే 10వ తేదీలోపు తమ దేశాన్ని విడిచి వెళ్లాలని గతంలో ముయిజ్జు ఆదేశించారు. దీంతో ఇటీవలే భారత సైనిక బృందం మాల్దీవులను వీడింది. ఈ నేపథ్యంలోనే ఘసన్ మౌమూన్ ప్రకటన రావడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed