- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలస్తీనియన్లకు 3 లక్షల డాలర్లు విరాళమిచ్చిన నోబెల్ విజేత మలాలా
దిశ, వెబ్‌డెస్క్ : నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ పాలస్తీనియన్లకు సాయం అందిస్తున్న మూడు స్వచ్ఛంద సంస్థలకు $3,00,000 (సుమారు ₹2.5 కోట్లు) విరాళంగా ఇస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. మంగళవారం గాజాలోని ఆసుపత్రిపై బాంబు దాడిలో దాదాపు 500 మంది మరణించిన సంఘటనను చూసి తాను భయపడినట్లు యూసఫ్ జాయ్ అన్నారు. ఒక్కరు చేసిన తప్పుకు సామూహిక శిక్ష సమాధానం కాదని అని ట్విట్టర్ వేదిక తన అభిప్రాయాన్ని పంచుకుంది. 'గాజాలోని అల్-అహ్లీ హాస్పిటల్‌పై బాంబు దాడిని చూసి నేను భయపడిపోయాను, ఆ పరిణామాన్ని నేను నిస్సందేహంగా ఖండిస్తున్నా' అని యూసఫ్‌జాయ్ ట్విట్టర్ ద్వారా ఓ వీడియో సందేశంలో తెలిపారు. 'గాజాలోకి మానవతా సహాయాన్ని అనుమతించాలని, కాల్పుల విరమించాలని నేను ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దాడిలో పూర్తిగా నష్టపోయిన పాలస్తీనియన్ ప్రజలకు సహాయం చేస్తున్న మూడు స్వచ్ఛంద సంస్థలకు నేను 3 లక్షల డాలర్లు విరాళం ఇస్తున్నా' అని ఆ వీడియోలో ఉంది.