New York:అమెరికాలో ఘోర విషాదం..చెరువులో మునిగి చనిపోయిన తెలుగు దంపతుల కుమార్తెలు

by Maddikunta Saikiran |
New York:అమెరికాలో ఘోర విషాదం..చెరువులో మునిగి చనిపోయిన తెలుగు దంపతుల కుమార్తెలు
X

దిశ, వెబ్‌డెస్క్:అమెరికాలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. న్యూయార్క్‌(New York) నగరం లాంగ్ ఐలాండ్ (Long Island)లోని హోల్ట్స్‌విల్లే(Holtsville)లో ఓ అపార్ట్‌మెంట్ లో డేవిడ్(David),సుధా గాలి(Sudha Gali) అనే తెలుగు దంపతులు ఇద్దరు నివాసం ఉంటున్నారు.శనివారం రోజు తమ అపార్ట్‌మెంట్ సమీపంలోని ఓ సరస్సులో వారిద్దరి కుమార్తెలు మునిగిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దంపతులు నిర్వహిస్తున్న సోషల్ మీడియాలో తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. డేవిడ్,సుధా గాలి దంపతులకు 4 ఏళ్ల రూత్ ఎవాంజెలిన్ గాలి(Ruth Evangeline Gali) , 2 ఏళ్ల సెలాహ్ గ్రేస్ గాలి(Selah Grace Gali) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శనివారం రోజు వీరిద్దరూ ఆడుకోవడానికి ఇంటి నుండి బయటికి వెళ్లారు. ఎంతసేపటికి వారు ఇంటికి రాకపోవడంతో వారి కోసం తల్లి వెతకడం ప్రారంభించింది. చుట్టుపక్కల ఎంతసేపు వెతికిన కనిపించక పోవడంతో వారు తప్పిపోయినట్లు తల్లి గుర్తించింది. దీంతో హుటా హుటిన 911 అనే ఎమర్జెన్సీ నంబర్ కు ఫోన్ చేసి పిల్లలు తప్పిపోయిన సమాచారం అందించింది.దీంతో రెస్క్యూ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని వెతకగా వారు ఉంటున్న అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ సమీపంలోని చెరువులో పిల్లలు కనిపించారు. వెంటనే వారిని సమీపం లో ఉన్న స్టోనీ బ్రూక్ యూనివర్శిటీ(Stony Brook University) ఆసుపత్రికి తరలించగా అప్పటికే పిల్లలు చనిపోయారని వైద్యులు వెల్లడించారు.

కొన్ని మీడియా రిపోర్ట్ లు తెలిపిన వివరాల ప్రకారం పిల్లల తండ్రి, డేవిడ్ తన వీసా సమస్యల కారణంగా ప్రస్తుతం భారతదేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. అతను అత్యవసర వీసాతో అమెరికాకు తిరిగి రావాల్సి ఉంది. కానీ అది కుదరలేదు. దీంతో తాను ఇండియాలోనే ఉండాల్సి వచ్చింది. చివరికి డేవిడ్ తన కుమార్తెలను కోల్పోయాడు. ChristForLife Church అనే నిధుల సేకరణ చేసే సంస్థ తెలిపిన సమాచారం ప్రకారం డేవిడ్‌ను ఎమర్జెన్సీ వీసాతో USకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అతని వీసా క్రమబద్ధీకరించబడిన తర్వాత, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.కుమార్తెలు ఇద్దరు మృతి చెందడంతో వారి కుటుంభ సభ్యుల ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి.తల్లి చేసిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed