- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
110 ఏళ్ల క్రితం మునిగిపోయిన Titanic Ship రియల్ వీడియో రిలీజ్!
దిశ, వెబ్‌డెస్క్ః టైటానిక్ పేరు వింటేనే ఆరాధనతో పాటు భయం కూడా కలుగుతుంది. అయితే, ఈ భారీ ఓడ సముద్రంలో మునిగిన తర్వాత దాన్ని కనుక్కోడానికి, పరిశీలించడానికి వివిధ మిషన్ల ద్వారా ఎంతో ఖర్చు చేశారు. ఇందులో భాగంగా, సముద్రంలో ఎనిమిది రోజుల పాటు కొనసాగిన ఇటీవలి యాత్ర ఈ ఏడాది మేలో జరిగింది. ఈ ఎక్స్‌పిడేషన్‌లో భాగంగా తీసిని టైటానిక్ సరికొత్త చిత్రాలను తాజాగా విడుదల చేశారు. వీటిల్లో ఇప్పటి వరకూ చూడని చిత్రాలు ఉండగా, అందులో 200-పౌండ్ల బరువున్న టైటానిక్ యాంకర్ గొలుసు ప్రాధాన్యత సంతరించుకుంది. భారీ పోర్ట్‌సైడ్ యాంకర్‌తో పాటు, 110 సంవత్సరాల క్రితం రెండు భాగాలుగా విరిగి, మునిగిపోయిన ఈ ఓడ సింగిల్-ఎండ్ బాయిలర్‌ను చూపించే కొత్త వీడియో వైరల్ అయ్యింది.
ఈ వీడియోను డైవింగ్ టూర్ కంపెనీ ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ చిత్రీకరించింది. ఇది ఏప్రిల్ 12, 1992 నుండి మనిషి కళ్లకు కనిపించని అల్లికలు, రంగులకు సంబంధించిన విశేషాలను చూపుతుంది. సదరు పరిశోధక బృందం నిర్దిష్ట ప్రదేశాలలో దాదాపుగా 80,000 పిక్సెల్‌లు (8k) రిజల్యూషన్‌తో జూమ్ చేసి, చిత్రించారు. టైటానిక్‌కు చెందిన 2వ వార్షిక ప్రయాణంలో ఆ సంస్థ ఈ వీడియో తీసింది.