పార్లమెంట్‌లోనే బట్టలు విప్పిన MP.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!

by Satheesh |   ( Updated:2023-05-09 11:56:55.0  )
పార్లమెంట్‌లోనే బట్టలు విప్పిన MP.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
X

దిశ, వెబ్‌డెస్క్: నేపాల్ పార్లమెంట్‌లో సోమవారం ఓ ఎంపీ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రతినిధుల సభలో మాట్లాడేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ ఎంపీ అమ్రేష్ కుమార్ సింగ్ సభలోనే తన చొక్కా విప్పి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతోన్న అవినీతి గురించి పార్లమెంట్‌లో మాట్లాడేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఎంపీ స్పీకర్‌ను కోరారు. అయినప్పటికీ స్పీకర్ దేవరాజ్ ఘిమిరే సమయం ఇవ్వకపోవడంతో ఎంపీ అమ్రేష్ కుమార్‌కు ఆగ్రహానికి గురై సభలోనే చొక్కా విప్పారు. దీంతో స్పీకర్ దేవరాజ్ ఘిమిరే ఎంపీని హెచ్చరించారు. సభ నిబంధలకు వ్యతిరేకంగా వ్యవహారిస్తే చర్యలు తీసుకుంటానన్నారు. కాగా, ఎంపీ అమ్రేష్ కుమార్‌ సభలో చొక్కా విప్పుతోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story