దాచుంచిన చంద్రుని నమూనాల‌ను 50 ఏళ్ల త‌ర్వాత తీసిన నాసా! ఇప్పుడేం కాబోతోంది..?!

by Sumithra |
దాచుంచిన చంద్రుని నమూనాల‌ను 50 ఏళ్ల త‌ర్వాత తీసిన నాసా! ఇప్పుడేం కాబోతోంది..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః భూగోళాన్ని దాటి మ‌నం తాకిన మ‌రో గోళం మూన్‌. ఇందులోనే మ‌నమింకా క‌నిపెట్టాల్సిన విష‌యాలు కోకొల్ల‌లున్నాయి. అంత‌ర్జాతీయంగా దానికి సంబంధించి ఎన్నో ప‌రిశోధ‌న‌లూ జ‌రుగుతూనే ఉన్నాయి. ప్ర‌స్తుతం మూన్ టు మార్స్ అనే ప్రోగ్రామ్ కోసం నాసా విప‌రీతంగా ఖ‌ర్చు చేస్తోంది. ఇందులో భాగంగానే, నాసా ఇప్పుడు 50 ఏళ్ల క్రితం నాటి విష‌యాల‌ను మ‌రోసారి తవ్వుతోంది. అప్ప‌ట్లో అపోలో మిష‌న్‌లో భాగంగా చంద్రుడిపై నుండి తెచ్చిన న‌మూనాలను ఇప్ప‌టి వ‌ర‌కూ ల్యాబుల్లోనే దాచుంచారు. 1972లో వాక్యూమ్-సీల్డ్ డ్రైవ్ ట్యూబ్‌లో భూమికి తీసుకు వ‌చ్చిన ఈ న‌మూనాల‌ను ఇంత‌వ‌ర‌కూ తాక‌క పోవ‌డం విశేషం. అలాగ‌ని వాటిని బ‌హిర్గ‌తం కూడా చేయ‌లేదు. భూమిపైన ఉన్న వాతావ‌ర‌ణంతో వాటిని పోల్చి చూడ‌లేదు. ఇప్ప‌డు 50 సంవత్సరాల తర్వాత ఈ నమూనాలను అధ్యయనం చేసే తొమ్మిది ప‌రిశోధ‌క బృందాలను నాసా ఎంపిక చేస్తోంది. సుమారు 1.8 పౌండ్ల బరువు గ‌ల‌ అపోలో 17లో సేక‌రించిన ఆరు న‌మూనాల‌ను వీళ్లు ప‌రిశోధిస్తారు. వీటి ప‌రిశీల‌న కోసం నాసా 8 మిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు ఇటీవ‌లి బ‌డ్జెట్‌లోనూ పేర్కొన్నారు. అయితే, ఇన్నేళ్ల త‌ర్వాత వాటిని బ‌య‌ట‌పెట్టి, ప‌రిశోధ‌న కోసం ఇంత ఖ‌ర్చు చేయ‌డంపై స‌ర్వ‌త్రా ఆసక్తి నెల‌కొంది.

Advertisement

Next Story

Most Viewed