- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Biden : సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారనే బైడెన్‌ను తప్పుకోమన్నా : నాన్సీ పెలోసీ
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా అధ్యక్ష రేసు నుంచి తాను తప్పుకోవడానికి హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మాజీ స్పీకర్, డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు నాన్సీ పెలోసీ ఒత్తిడి కూడా కారణమే అని ఇటీవల జో బైడెన్ వెల్లడించారు. ఈనేపథ్యంలో రాజకీయ పరిశీలకులు అందరి చూపు నాన్సీ పెలోసీ వైపు మళ్లింది. దీనిపై తాజాగా పెలోసీ స్పందించారు. సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలో బైడెన్ లేరనే ఉద్దేశంతోనే తాను ఆయనపై ఒత్తిడి పెంచానని, అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని సూచించానని ఆమె ఒప్పుకున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల సర్వే నివేదికలను బైడెన్‌కు చూపించి మీరు ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేరు అని పెలోసీ చెప్పారని ఇటీవల సీఎన్ఎన్ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇక ఇటీవలే డెమొక్రటిక్ పార్టీలో పెలోసీకి సన్నిహితంగా ఉండే పలువురు కీలక నాయకులు కూడా బైడెన్‌కు వ్యతిరేకంగా బహిరంగంగానే వాణిని వినిపించిన సంగతి తెలిసిందే.