ఆస్ట్రేలియాలో హర్యానా విద్యార్థి హత్య..ఇద్దరు భారతీయ సోదరుల అరెస్టు

by samatah |
ఆస్ట్రేలియాలో హర్యానా విద్యార్థి హత్య..ఇద్దరు భారతీయ సోదరుల అరెస్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాకు చెందిన విద్యార్థి నవజీత్ సంధును ఇటీవల ఆస్ట్రేలియాలో హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా ఇద్దరు భారతీయ సోదరులను పోలీసులు అరెస్టు చేశారు. న్యూ సౌత్ వేల్స్‌లోని గౌల్‌బర్న్‌లో నిందితులు అభిజీత్, రాబిన్ గార్టన్‌లను అదుపులోకి తీసుకున్నట్టు విక్టోరియా పోలీసులు వెల్లడించారు. వీరిద్దరూ, హత్యకు గురైన బాధిత విద్యార్థి హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. కాగా, ఓ ఇంటి అద్దె విషయంలో కొందరు విద్యార్థుల మధ్య ఘర్షణ జరగగా నవజీత్ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలోనే ఆగ్రహానికి గురైన తోటి విద్యార్థులు దారుణంగా పొడిచి చంపారు. మెల్ బోర్న్‌లోని ఓర్మండ్ ప్రాంతంలో ఈ నెల 5వ తేదీన ఘటన జరిగింది. ఈ ఘటనలో నవజీత్ స్నేహితుడికి కూడా గాయాలయ్యాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నవజీత్ ఏడాది క్రితమే ఆస్ట్రేలియా వెళ్లాడు.

Advertisement

Next Story

Most Viewed