సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి: ఇజ్రాయెల్‌లోని పౌరులకు భారత్ సూచనలు

by samatah |
సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి: ఇజ్రాయెల్‌లోని పౌరులకు భారత్ సూచనలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌పై లెబనాన్ చేసిన క్షిపణి దాడిలో ఓ భారతీయుడు మరణించగా మరో ఇద్దరికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌లోని ఇండియన్స్‌కు భారత్ కీలక సూచనలు చేసింది. ‘ప్రస్తుతం నెలకొన్న భద్రతా పరిస్థితుల దృష్యా ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. ముఖ్యంగా ఉత్తర ఇజ్రాయెల్, దక్షిణ ఇజ్రాయెల్ లోని పౌరులు ఇతర ప్రాంతాలకు వెళ్లండి’ అని ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేగాక ఓ హెల్ప్ లైన్ నంబర్ +972-35226748, మెయిల్ ఐడీ [email protected]ను అందుబాటులో ఉంచింది. ఏమైనా సమస్యలుంటే ఈ నంబర్లలో సంప్రదించాలని సూచించింది. మరోవైపు క్షిపణి దాడిలో భారతీయులు మరణిచడంపై ఇజ్రాయెల్ స్పందించింది. ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నట్టు తెలిపింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం అని పేర్కొంది. కాగా, లెబనాన్ దాడిలో మరణించిన పట్నీబిన్ మాక్స్‌వెల్ కేరళలోని కొల్లం నివాసి. ఆయన రెండు నెలల క్రితం ఓ వ్యవసాయ క్షేత్రంలో పనిచేయడానికి ఇజ్రాయెల్ వెళ్లినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed