మాల్దీవులు అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం!: ప్రవేశపెట్టే యోచనలో ప్రతిపక్షాలు

by samatah |
మాల్దీవులు అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం!: ప్రవేశపెట్టే యోచనలో ప్రతిపక్షాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మాల్దీవులు పార్లమెంటులో మెజారిటీ కలిగి ఉన్న ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ (ఎండీపీ).. దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే సభ్యుల నుంచి సంతకాలు సేకరించినట్టు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఎండీపీ, డెమొక్రాట్‌లతో కూడిన మొత్తం 34 మంది సభ్యులు ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చినట్టు తెలిపాయి. అయితే సంతకాలు చేసిన తీర్మానాన్ని పార్లమెంటులో సమర్పించలేదు. అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్, ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్‌కు చెందిన ఎంపీలు సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించడంతో ఆదివారం మాల్దీవులు పార్లమెంటులో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. అభిశంసన ఊహాగానాలతో పార్లమెంటుతో భారీగా భద్రతను మోహరించారు.

ముయిజ్జు పదవికి ప్రమాదం?

మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే అభిశంసన తీర్మానం కారణంగా తన పదవిని కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నట్టు మీడియా కథనాలు వెల్లడించాయి. ఎందుకంటే అభిశంసన తీర్మానాన్ని సులభతరం చేయడానికి మాల్దీవుల పార్లమెంటు ఇటీవల తమ నిబంధనలను సవరించింది. దీని ప్రకారం..56ఓట్లతో అధ్యక్షుడిని అభినంశనకు గురిచేయొచ్చు. ప్రస్తుతం ఎండీపీ(43). డెమొక్రాట్‌లకు(13) కలిపి మొత్తం 56మంది ఎంపీలు ఉన్నారు. కాగా, గతేడాది నవంబర్‌లో మాల్దీవులు అధ్యక్షుడిగా ముయిజ్జు బాధ్యతలు స్వీకరించిన తర్వాత, చైనా అనుకూల నాయకుడిగా పరిగణించబడుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story