- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒకేసారి 280 మంది విద్యార్థుల కిడ్నాప్.. వారి డిమాండ్ ఇదే..
దిశ, నేషనల్ బ్యూరో: ఆఫ్రికా దేశం నైజీరియాలో బందిపోట్లు రెచ్చిపోయారు. స్కూళ్లపై దాడులు చేసి ఒకేసారి 280 మందికి పైగా విద్యార్థులను కిడ్నాప్ చేశారు. స్థానిక మీడియా సంస్థల కథనాల ప్రకారం, కదునా రాష్ట్రం కురిగా పట్టణంలోని ఓ సెకండరీ స్కూల్లోకి గురువారం ఉదయం డజన్లకొద్దీ బందిపోట్లు తుపాకులతో బైక్‌లపై వచ్చారు. తుపాకులతో బెదిరించి 187 మంది విద్యార్థులను పట్టుకెళ్లిపోయారు. ఇదే సమయంలో కురిగాలోనే స్థానిక ప్రైమరీ పాఠశాల నుంచి కూడా 125 మందిని కిడ్నాప్ చేశారు. అయితే, అందులోంచి 25మంది తప్పించుకుని వచ్చారు. దీంతో మొత్తం 280 మందికి పైగా విద్యార్థులు కిడ్నాప్‌నకు గురయ్యారు. వీరంతా 8 నుంచి 15ఏళ్లలోపు వారే. విద్యార్థులతోపాటు ఓ టీచర్‌ను సైతం అపహరించుకువెళ్లారు. కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న క్రమంలో స్థానికులు అడ్డుకోగా, బందిపోట్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి, ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కిడ్నాపైన విషయాన్ని కదునా రాష్ట్ర గవర్నర్ ఉబా సానీ ధ్రువీకరించారు. బాధితులందరినీ ఎలాగైనా రక్షిస్తామని ఆయన వెల్లడించారు. సాయుధ దళాలు గాలింపు చర్యలు చేపట్టాయని, విద్యార్థులందరినీ సురక్షితంగా తీసుకొస్తామని తెలిపారు. కాగా, ఈ ప్రాంతంలో విద్యార్థుల కిడ్నాప్‌లు తరచూ జరుగుతుంటాయి. అయితే, కొంతకాలంగా ఈ నేరాలు తగ్గుతూ వచ్చాయి. కానీ, తాజా ఘటనతో స్థానికులు మరోసారి ఉలిక్కిపడ్డారు. బందిపోట్లు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని కిడ్నాప్ చేసినవారిని వదిలేస్తూ ఉంటారు.