Monkeypox: మంకీపాక్స్‌ కొత్త కొవిడ్ కాదు.. ఎలా నియంత్రించాలో తెలుసు: WHO

by Harish |   ( Updated:2024-08-20 10:15:46.0  )
Monkeypox: మంకీపాక్స్‌ కొత్త కొవిడ్ కాదు.. ఎలా నియంత్రించాలో తెలుసు: WHO
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్‌ కొత్త కొవిడ్ కాదని, దాని వ్యాప్తిని ఎలా నియంత్రించాలో తెలుసు అని, ఈ సమస్యను తప్పక పరిష్కరించగలమని WHO యూరప్ ప్రాంతీయ డైరెక్టర్ హన్స్ క్లూగే మీడియా సమావేశంలో అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పాక్స్‌ను నియంత్రించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నాము. ఈ వ్యాధిలో కొత్త లేదా పాత జాతి వైరస్ విస్తరణ అనే దానితో సంబంధం లేకుండా దీనిని ఎదుర్కొగలమని ఆయన చెప్పారు.

మంకీపాక్స్‌, చీముతో నిండిన గాయాలు, ఫ్లూ-వంటి లక్షణాలకు కారణమయ్యే వైరల్ ఇన్ఫెక్షన్. ప్రస్తుతం దీనిలో క్లాడ్ 1b రకం ప్రపంచవ్యాప్త ఆందోళనను రేకెత్తించింది, ఎందుకంటే ఇది సాధారణ సన్నిహితంగా ఉన్నప్పటికీ మరింత సులభంగా వ్యాప్తి చెందుతుంది. గత వారం స్వీడన్‌లో ఈ వేరియంట్ కేసు వెలుగులోకి వచ్చింది. మెరుగైన ప్రజారోగ్య సలహాలను పాటించడం వలన కొత్త క్లాడ్ 1 స్ట్రెయిన్‌ నుంచి దూరంగా ఉండవచ్చని, నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి మంగళవారం చెప్పారు. మరోవైపు వ్యాధి వ్యాప్తి దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలకు భారత కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దుల్లోని నౌకాశ్రయాల దగ్గర కూడా నిఘా పెంచింది.

Advertisement

Next Story