ఇక ఆపండి.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ కీలక వ్యాఖ్యలు

by Satheesh |
ఇక ఆపండి.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మానవత్వం, మానవీయ విలువలకు సంబంధించిన సమస్య అని తాను నమ్ముతున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. హిరోషిమాలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సులో మోడీ ఇరు దేశాల యుద్ధం గురించి మాట్లాడారు. ఇది యుద్ధాల శకం కాదని రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ప్రభావితం అవుతున్నాయని అభిప్రాయపడ్డారు. వివాదాలు, ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.

కాగా ఈ యుద్ధం పట్ల క్వాడ్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దౌత్య చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. ఇది యుద్ధాల శకం కాదని ప్రధాని మోడీ మాటలను క్వాడ్‌లోని మిగతా సభ్య దేశాల అధినేతలు ఉటంకించారు. ఇరు దేశాల మధ్య యుద్ధం వద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఆహారం, ఇంధన భద్రతపై ప్రభావాన్ని గుర్తించినట్లు తెలిపారు. సమగ్ర న్యాయమైన చర్చలకు మద్దతిస్తున్నట్లు క్వాడ్ సభ్య దేశాలు ఓ ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Next Story