- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విధ్వంస నగరంలో గాంధీ విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోడీ
దిశ, డైనమిక్ బ్యూరో: హిరోషిమా అనే పదం వింటే ప్రపంచం నేటికి భయపడుతోందని.. ఇలాంటి చోట మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం తనకు లభించడం గొప్పగా ఉందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జీ7 సదస్సులో పాల్గొనేందుకు జపాన్ దేశంలో పర్యటిస్తున్న మోడీ శనివారం హిరోషిమాలో ఆ దేశ ప్రధాని పుమియో కిషిదాను కలిశారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. హిరోషిమాలో ప్రపంచ శాంతి దూత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి తనకు అవకాశం కల్పించిన జపాన్ ప్రభుత్వానికి కృతజ్ఞలు తెలిపారు.
ప్రపంచ యుద్ధం సమయంలో అణుబాంబు దాడిలో ఈ నగరం మారణహోమాన్ని చూసింది. నేటికి ప్రపంచం వాతావరణ మార్పులు ఉగ్రవాదంతో పెనుగులాడుతోంది. వీటిపై విజయం సాధించాలంటే గాంధీ ఆశయాలను అనుసరించడమే ఉత్తమ పరిష్కారం అని అన్నారు. ఈ సందర్భంగా భారత్-జపాన్ దేశాల మధ్య స్నేహబంధం, వాణిజ్యం, సంస్కృతి అంశాలపై ఇరు దేశాల ప్రధానులు చర్చించారు. ఈ పర్యటన సందర్భంగా మోడీ జపనీస్ రచయిత పద్మశ్రీ డాక్టర్ టోమియో మిజోకమి, జపనీస్ పెయింటర్ హిరోకో టకయామాలతో భేటీ అయ్యారు. ఇరు దేశాలు మరింత దగ్గర కావడంలో వీరు చేసిన కృషిని మోడీ అభినందించారు.