Floods: బంగ్లాదేశ్ వరదలకు భారత డ్యామ్ కారణం కాదు: MEA

by Harish |
Floods: బంగ్లాదేశ్ వరదలకు భారత డ్యామ్ కారణం కాదు: MEA
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌ తూర్పు సరిహద్దుల్లోని జిల్లాల్లో వరదలు అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అయితే ఈ వరదలకు భారత్‌కు చెందిన డ్యామ్ కారణమని ఆరోపణలు వస్తుండగా, తాజాగా దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. త్రిపురలోని గుమ్టి నదికి ఎగువన ఉన్న డుంబుర్ డ్యామ్‌ను తెరవడం వలన బంగ్లా సరిహద్దు జిల్లాల్లో వరదలు వచ్చాయని వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు. త్రిపుర, బంగ్లాదేశ్‌లోని పరిసర జిల్లాల్లో ఆగస్టు 21 నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.

డుంబుర్ డ్యామ్ బంగ్లాదేశ్ సరిహద్దు నుండి 120 కిలోమీటర్ల ఎగువన ఉంది. దాదాపు 30 మీటర్ల ఎత్తులో ఉంది. దీని నుండి బంగ్లాదేశ్ 40 మెగావాట్ల విద్యుత్‌ను పొందుతుంది. డ్యామ్‌లో నీటి ఉద్ధృతి గురించిన సమాచారాన్ని బుధవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు అందించాం. అయితే, సాయంత్రం 6 గంటలకు, వరదల కారణంగా ఏర్పడిన విద్యుత్తు అంతరాయంతో కమ్యూనికేషన్‌కు అంతరాయం కలిగింది. ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా మ్యూనికేషన్‌ కొనసాగించేందుకు ప్రయత్నించామని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఈ వరదల ప్రభావంతో రెండు వైపులా నష్టం కలిగింది. రెండు దేశాలు 54 సాధారణ సరిహద్దు నదులను పంచుకుంటున్నందున, నదీ జలాల సహకారం, ద్వైపాక్షిక సంప్రదింపులు, సాంకేతిక చర్చల ద్వారా నదీ జలాల నిర్వహణలో సమస్యలను పరిష్కరించుకుంటామని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed