ఆకాశం నుండి జారిప‌డిన రాయి కోసం 18 నెల‌లు వెతికాడు.. దాని విలువ తెలుసా..?!

by Sumithra |
ఆకాశం నుండి జారిప‌డిన రాయి కోసం 18 నెల‌లు వెతికాడు.. దాని విలువ తెలుసా..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఆకాశంలో న‌క్ష‌త్రం ప‌డిపోతుంది అని వినే ఉంటాం. అలాగే, ఆకాశంలో ఉల్క‌లు (రాళ్లు) ఓ వెలుగులా వ‌చ్చి భూమిపైన ప‌డుతుంటాయి. కొన్ని ఆకాశంలోనే పొడిలా మారి మాయ‌మైతే, మ‌రికొన్ని అన్ని వ‌త్తిడులనూ త‌ట్టుకొని భూమిని చేరుకుంటాయి. అలాంటి ఉల్క‌ల్లో ఎలాంటి ప‌దార్థం ఉంటుందో తెలియ‌దు, అది అంత వత్తిడిని త‌ట్టుకుందంటే ఏ ప‌దార్థ‌మైనా కావ‌చ్చు అందుకే దానికి ఎంతో విలువ ఉంటుంది. అలాంటిది మ‌న ఇంటి ఎదురో, వెన‌కో, ప‌క్క‌నో... లేక‌పోతే, మ‌న ఇంటి పెర‌ట్లోనే ప‌డితే..! ఆహా.. అంత‌కంటే భాగ్య‌మా అని క‌ళ్ల‌క‌ద్దుకోరూ...! ఎవ్వ‌రైనా అంతే. ఇలాగే, యూకేలో త‌న ఇంటి ద‌గ్గర్లో ప‌డిన రాయి కోసం 38 ఏళ్ల టోని వైల్డింగ్ అనే వ్య‌క్తి 18 నెల‌ల పాటు శోధించాడు.

ఒకానొక రాత్రి, నార్త్ వేల్స్‌లోని రెక్స్‌హామ్‌లో ఉండే తన ఇంటి పైనుండి ఓ ఫైర్‌బాల్ ఎగిరడం టోనీ గ‌మ‌నించాడు. అయితే, అది ఎక్క‌డ ప‌డిందో తాను స్ప‌ష్టంగానే చూశాడు. అందుకే దాని కోసం వెత‌కాల‌ని నిశ్చ‌యించుకున్నాడు. తీవ్రంగా వెతికిన త‌ర్వాత‌ అతను చివరకు ఏదో ఒక రాయి లాంటి ప‌దార్థాన్ని క‌నుక్కున్నాడు. అది అవునా కాదా అనే సందేహం మాత్రం త‌న‌లో లేక‌పోలేదు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు దాన్ని ప‌రిశీలించిన‌ తర్వాత, అది 'అద్భుతమైన మార్కింగ్‌'ల‌తో' 2lb 4oz అనే వస్తువును కామెట్-క్రస్ట్ ఉల్క అని గుర్తించారు. ఆ ఉల్క విలువ మిలియన్ల పౌండ్లు ఉండవచ్చని అప్పుడు ధృవీకరించారు.




గత 18 నెలలుగా అత‌ను చూసిన ఆ ఫైర్ బాల్‌ని క‌నుక్కోవాల‌ని ఎంతో ప్ర‌య‌త్నించాడు టోని. ఫైర్‌బాల్ ప‌డిన దారిలో నడుస్తూనే ఉన్నాడు. ఈ మ‌ధ్య‌లో ఎన్నో ర‌కాల రాళ్ల‌ను ఇంటికి తీసుకొచ్చేవాడు. కానీ అస‌లైన ఉల్క దొరికేది కాదు. అయితే, ఒకానొక రోజు త‌న ఇంటి వెనుక ఉన్న మొక్క‌జొన్న పొలంలో అస‌లైన ఉల్క‌ను చేజిక్కిచ్చుకున్న టోనీ సంతోషంతో ఎగిరి గంతేశాడు. బుర‌ద‌తో క‌ప్పేసి ఉన్న రాయిని శుభ్రంగా చేసి, చూశాడు. అప్పుడ‌ది తెల్ల‌టి ఫ్యూజ‌న్ క్ర‌స్ట్‌తో నున్న‌గా ఉంది. కాస్త గాజులా క‌నిపించింది. తెల్లటి స్ఫటికాకార గీతలతో రెండు టోన్‌లను కలిగి ఉంది. మరుసటి రోజు దాన్ని ఫైర్‌బాల్‌ల ఆన్‌లైన్ రిజిస్టర్‌లో పోస్ట్ చేశాడు. లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం దానిపైన ఆస‌క్తి వ్యక్తం చేసింది. అయితే అప్పుడు యూకే క‌రోనా లాక్‌డౌన్‌లో ఉండ‌టం వ‌ల్ల‌ టోనీ దాన్ని వారికి ఇవ్వ‌లేదు. చివ‌రికి, అమెరికా నిపుణుడు దాన్ని కామెట్-క్రస్ట్ ఉల్కగా కనిపించిందని, దాని విలక్షణమైన డింప్లింగ్ కారణంగా 'అంతర్గత సౌర వ్యవస్థ' నుండి ఈ ఉల్క వ‌చ్చిన‌ట్లు గుర్తించాడు. ఇది సాధారణంగా వాతావరణంలోకి ప్ర‌వేశించిన త‌ర్వాత‌ చల్లబడి, తర్వాత ఇత‌ర‌ 'వాయువుల శూన్యాల' నుండి భూమిపైన ప‌డుతుంద‌ని చెప్పాడు. అయితే, ఇప్పటికీ అది టోనీ ద‌గ్గరే ఉంది. మ‌రిన్ని ప‌రిశోధ‌న‌ల త‌ర్వాత దాని విలువ‌ను చూసి, ఇచ్చేస్తాడో, అంత విలువున్న‌ది త‌న‌తోనే ఉంచుకుంటాడో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed