- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్కార్ వేదికపై ఫ్యాషన్ డ్రెస్‌లో మెరిసిన మలాలా యూసఫ్‌జాయ్
దిశ, వెబ్‌డెస్క్: ఆస్కార్ వేదికపై నోబెల్ అవార్డు గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ తళుక్కున మెరిసారు. సిల్వర్ కలర్ రాల్ఫ్ లారెన్ గౌన్ ధరించిన మలాలా ఆస్కార్ వేదికపై అందరి దృష్టిని ఆకర్షించారు. ఆస్కార్ 2023 వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఆమె పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా ఆస్కార్ నిర్వాహకులు వేడుకల్లో స్టైల్ బార్‌ను అనేక రేట్లు పెంచారు. కాగా ఈ సారి విద్యావేత్త మహిళా హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్ వినూత్నంగా ఫ్యాషన్‌లో పాల్గొన్నారు.
సల్వార్ కమీజ్ ప్లేస్‌లో రాల్ఫ్ లారెన్ గౌన్ ధరించిన మలాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మామూలుగా మలాలా పబ్లిక్ అప్పియరెన్స్‌లో తప్పనిసరిగా తన తలను కప్పుకుని కనిపించేంది. ఈ సారి ఫ్యాషన్ దుస్తుల్లో కూడా తన అప్పియరెన్స్‌ను మార్చుకోకపోవడం విశేషం. మాలాలా డ్రెస్‌లో సూపర్ స్టైలిష్‌గా కనిపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు స్పందిస్తూ మలాలాను గ్లామరస్‌గా, మేక్ అప్, హేర్ స్టైల్‌తో పరిచయం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కువగా మేకప్ లేకున్నా మలాలా ఫ్యాబ్యులస్‌గా కనిపించిందని వారు తెలిపారు.