King Charles Coronation : పట్టాభిషేక కార్యక్రమంలో అపశ్రతి.. అదుపుతప్పిన గుర్రం ఏం చేసిందో చూడండి!

by S Gopi |   ( Updated:2023-05-14 02:10:08.0  )
King Charles Coronation : పట్టాభిషేక కార్యక్రమంలో అపశ్రతి.. అదుపుతప్పిన గుర్రం ఏం చేసిందో చూడండి!
X

దిశ, వెబ్ డెస్క్ : బ్రిటన్ రాజు చార్లెస్ (King Charles) పట్టాభిషేకం కన్నుల పండగలా జరిగింది. రాచరికపు లాంఛనాలతో బ్రిటన్ ప్రభుత్వం (Britain Govt) అధికారికంగా ఈ వేడుకను నిర్వహించింది. 1953 తర్వాత బ్రిటన్ లో జరిగిన పట్టాభిషేకం మహోత్సవాన్ని (King Charles Coronation) యావత్ ప్రపంచం వీక్షించింది. కాగా ఈ వేడుకలో ఒక అపశ్రుతి జరిగింది. గౌరవ వందనం కోసం ఏర్పాటుచేసిన అశ్వదళంలో (Cavalry) ఓ గుర్రం (Horse) అదుపు తప్పి కొంత గందరగోళం సృష్టించింది.

లండన్ (London)లోని వెస్ట్ మినిస్టర్ అబేలో (Westminster Abbey) శనివారం జరిగిన పట్టాభిషేక మహోత్సవంలో ఓ సైనికుడి గుర్రం నియంత్రణ కోల్పోయింది. అటు ఇటు పరుగెడుతూ హల్ చల్ చేసింది. యాల్ హౌస్ హోల్డ్ లోని మౌంటెడ్ సభ్యుడిపై ఆ గుర్రం దాడి చేసింది. అనంతరం అక్కడే వేడుక కోసం వచ్చిన అతిథులు (Guests), వీక్షకులపై దూసుకెళ్లింది. ఈ పరిణామంతో ప్రజలు భయాందోళన చెందారు. అయితే వెంటనే ఉన్నతాధికారి వచ్చి గుర్రాన్ని నియంత్రించారు. కాగా ఈ సంఘటన పట్టాభిషేకం పూర్తయిన అనంతరం జరగడంతో అధికారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read: విమాన ప్రయాణంలో మహిళకు షాక్.. పక్క రాష్ట్రానికి బదులుగా పొరుగు దేశం వెళ్లిన విమానం!

Advertisement

Next Story