- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ బక్స్ కొత్త సీఈవోగా.. లక్ష్మణ్ నరసింహన్
దిశ, వెబ్ డెస్క్: సీఈవోలను ఎంచుకొనేందుకు మల్టీ నేషనల్ కంపెనీలు భారతీయులు లేదా భారత సంతతి వైపే చూస్తున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా అనేక దిగ్గజ కంపెనీలకు మనోళ్లే సీఈవోలు. తాజాగా లక్ష్మణ్ నరసింహన్ ఈ జాబితాలో చేరారు. గ్లోబల్ కాఫీ గెయింట్ స్టార్‌బక్స్‌కు కొత్త సీఈవోగా నియమితులయ్యారు. కంపెనీ స్థాపకుడు హౌవర్డ్ షూల్జ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
లక్ష్మణ్ నరసింహన్ 2022, అక్టోబర్ 1న కాబోయే సీఈవోగా స్టార్ బక్స్‌లో చేరారు. 30 ఏళ్లుగా రెస్టారెంట్, ఈకామర్స్, అడ్వైసింగ్ రిటైన్ కంపెనీలు, గ్లోబల్ బిజినెస్‌లను నడిపించిన అనుభవం ఆయన సొంతం. స్టార్‌బక్స్‌లో చేరడానికి ముందు ఆయన రెకిట్‌కు సీఈవోగా పనిచేశారు. ఇది కన్జూమర్ హెల్త్, హైజీన్, న్యూట్రిషన్ కంపెనీ. సరికొత్త కార్యక్రమాలతో కంపెనీ ఈ-కామర్స్ విభాగాన్ని ఆయన అభివృద్ధి చేశారు. కరోనా మహమ్మారి సమయంలో ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు అండగా నిలిచారు.
పెప్సీ కంపెనీలోనూ లక్ష్మణ్ నరసింహన్ వివిధ హోదాల్లో పనిచేశారు. గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్, పెప్సీకో లాటిన్ అమెరికా, యూరప్, సబ్ సహారన్ ఆఫ్రిక ఆపరేషన్స్‌కు సీఈవోగా సేవలు అందించారు. పెప్సీ కో అమెరికా ఫుడ్స్ సీఎఫ్‌వోగా పనిచేశారు. లక్ష్మణ్ నరసింహన్ పుణె విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశారు.
అదేవిధంగా పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన లాడర్ ఇన్‌స్టిట్యూట్‌లో జర్మనీ, ఇంటర్నేషనల్ స్టడీస్‌లో మాస్టర్స్ చేశారు. వార్టన్ సూల్ నుంచి ఫైనాన్స్‌లో ఎంబీయే పట్టా తీసుకున్నారు. ఆయన ఆరు భాషల్లో మాట్లాడగలరు. బ్రూకింగ్ ఇనిస్టిట్యూట్‌కు ట్రస్టీగా ఉన్నారు. వెరిజాన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, యూకే ప్రైమ్ మినిస్టర్ బిల్డ్ బ్యాక్ బెటర్ కౌన్సిల్‌లో ఆయన సభ్యుడు.