బ్రిటన్ రాజుకు కళ్లు, చెవుల లాంటి పోస్టుకు ఎంపికైంది ఈమే

by Hajipasha |
బ్రిటన్ రాజుకు కళ్లు, చెవుల లాంటి పోస్టుకు ఎంపికైంది ఈమే
X

దిశ, నేషనల్ బ్యూరో : బ్రిటన్ రాజు చార్లెస్ III తొలిసారిగా ఒక మహిళా సహాయకురాలి(ఈక్వెరీ)ని నియమించుకున్నారు. ఈ గొప్ప అవకాశాన్ని దక్కించుకున్న ఆ వనిత పేరు కాట్ ఆండర్సన్. వయసు 33 ఏళ్లు. ఈమె ప్రస్తుతం బ్రిటీష్ రాయల్ ఆర్టిలరీ విభాగంలో కెప్టెన్ స్థాయి అధికారిగా సేవలందిస్తున్నారు. ఇంతకుముందు బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ వద్ద సహాయకురాలిగా పనిచేసిన అనుభవం కాట్ ఆండర్సన్‌కు ఉంది. ఇకపై 75 ఏళ్ల బ్రిటన్ రాజు చార్లెస్ III‌కు సహాయకురాలిగా ఆమె వ్యవహరిస్తారు. ఇందులో భాగంగా పబ్లిక్ డ్యూటీలు, విదేశీ పర్యటనలు, రాజ కుటుంబ సభ్యులతో సమావేశాల్లో రాజుకు కాట్ ఆండర్సన్ సహాయ సహకారాలను అందిస్తారు. డైరీలోని ప్రణాళిక, దినచర్యలపై రాజును ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంటారు. ప్రముఖులతో సమావేశాల సమయంలో బ్రిటన్ రాజు అతిథులకు కూడా కాట్ ఆండర్సన్ సహాయ సహకారాలు అందిస్తారు. అంతేకాదు సైనిక విషయాలలో కూడా రాజుకు సలహాలను ఇస్తారు. అందుకే ఈక్వెరీ పోస్టును బ్రిటీష్ రాజకుటుంబంలో కీలకమైనదిగా భావిస్తారు. ఈ పోస్టులో ఉన్నవారిని రాజుకు ‘కళ్ళు.. చెవులు’గా అభివర్ణిస్తుంటారు.

Advertisement

Next Story

Most Viewed